Mon Dec 15 2025 07:29:33 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు రాయలసీమలో చంద్రబాబు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రజాగళం పేరిట చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. మ్యానిఫేస్టో విడుదల చేసిన తర్వాత దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని చంద్రబాబు తన పర్యటనల్లో ఎండగడుతున్నారు.
కడప, రాజంపేటలలో...
అభివృద్ధి కరువు, రాయలసీమలో తాము ఉన్నప్పుడు ఏం చేశామో కూడా చంద్రబాబు తన ప్రజాగళం సభల ద్వారా వివరిస్తూ వెళుతున్నారు. ఈరోజు చంద్రబాబు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. అనంతరం ఆయన కడపలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story

