Mon Dec 15 2025 08:15:12 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి సమావేశం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారం నిర్వహించనున్నారు. నిన్న ఉత్తరాంధ్రలో పర్యటించిన ఇరువురు నేతలు నేడు రాయలసీమలో పర్యటించనున్నారు. ఇద్దరూ కలసి ప్రజాగళం సభలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రెండు నియోజకవర్గాల్లో...
ఈరోజు ఇద్దరూ కలసి రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో జరగనున్న ప్రజాగళం సభలో పాల్గొంటారు. ఈ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను నేతలు పూర్తి చేశారు. గత కొద్ది రోజులుగా ఇద్దరు కలసి పర్యటిస్తూ పార్టీ అభ్యర్థు విజయం కోసం ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Next Story

