Thu Dec 18 2025 21:47:30 GMT+0000 (Coordinated Universal Time)
రేపో.. మాపో నన్ను అరెస్ట్ చేస్తారు: చంద్రబాబు నాయుడు
నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. ఒకటి, రెండు రోజుల్లో తనను

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని.. రేపో.. మాపో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అన్నారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తనపై కూడా దాడి చేస్తారని.. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని.. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అంగళ్లలో తన మీద హత్యాప్రయత్నం చేసి పైగా తన మీదే 307 కేసు పెట్టారన్నారు. తాను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారన్నారని ఆరోపించారు. యువగళంకు వచ్చి దాడులు చేసి వాళ్లపైనే కేసులు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కరుడుగట్టిన సైకో అని... సైకో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. బటన్ నొక్కడం ఒక్కటే తెలుసని, ఇచ్చిన డబ్బులకంటే పేపర్ ప్రకటనలకు ఎక్కువ ఇచ్చారన్నారు.
Next Story

