Tue Mar 17 2026 02:31:20 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు రెండు జిల్లాలకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఈ రెండు జిల్లాల్లో రా కదలిరా సభలో ఆయన పాల్గొంటారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తయ్యాయి. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలను నిర్వహిస్తున్న చంద్రబాబు రోజుకు రెండు జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
నెల్లూరు.. కర్నూలు జిల్లాలకు...
నిన్న రాత్రి అనంతపురం జిల్లా ఉరవకొండలో బస చేసిన చంద్రబాబు ఈరోు ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని కనుపర్తిపాడు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎస్వీజీఎస్ లో ఏర్పాటు చేసిన వేదికపై చేరుకుని ప్రసంగించనున్నారు. ఒంటి గంట వరకూ సభలోనే ఉండనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి కర్నూలు జిల్లా పత్తికొండకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కు వెళతారు.
Next Story

