Sun Mar 15 2026 16:35:45 GMT+0530 (India Standard Time)
నేడు మచిలీపట్నానికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నంలో ఆయన రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మచిలీపట్నంలో ఆయన రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈరోజు మచిలీప్నట్నంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ రాత్రికి ఎన్టీఆర్ సొంత గ్రామమైన నిమ్మకూరులో బస చేయనున్నారు.
ఇదేమి ఖర్మ కార్యక్రమంలో...
చంద్రబాబు పర్యటన కోసం తెలుగుదేశం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లుపూర్తి చేశారు. పెద్దయెత్తున సభలకు, రోడ్ షోలకు జనాలను సమీకరించాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నేడు మచిలీపట్నానికి తరలి రానున్నాయి. అయితే రోడ్ షో ల సందర్భంగా సభల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు.
Next Story

