Fri Dec 05 2025 23:53:10 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి చంద్రబాబు జిల్లా పర్యటనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. తొలివిడతగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేటి నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. తొలివిడతగా ఈరోజు అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తారు. నెలలో రెండు జిల్లాలను పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకోనున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా చోడవరం చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. రేపు అనకాపల్లి పార్లమెంట్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
రోడ్ షోలు....
అనంతరం అక్కడే నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. రేపు రాత్రి విశాఖనగరంలోని గాజువాక, ఎన్ఏడీ జంక్షన్, ఆనందపురం మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళతారు. 17వ తేదీన నెలిమర్ల, రామతీర్థం జంక్షన్ మీదుగా చీపురుపల్లి గ్రామాల్లో చంద్రబాబు రోడ్ షో జరగనుంది. తొలి విడత పర్యటనలో అనకాపల్లి, విజయనగరం జిల్లాలను చంద్రబాబు పర్యటిస్తారు. చంద్రబాబు పర్యటన కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు చేసింది. పూర్తిగా విజయవంతమయ్యేలా నేతలు జనసమీకరణకు సిద్దమయ్యారు.
Next Story

