Sun Mar 22 2026 04:02:04 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు చంద్రబాబుకు ఆపరేషన్
టీడీపీ అధినేత చంద్రబాబుకు నేడు శస్త్రచికిత్స జరగనుంది. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నేడు శస్త్రచికిత్స జరగనుంది. హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయనకు క్యాటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించనున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ పై నాలుగు వారాల పాటు రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
క్యాటరాక్ట్....
ఆయన కుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అంతకు ముందు ఆయనకు ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎడమ కంటికి ఇదివరకే క్యాటరాక్ట్ ఆపరేషన్ జరిగింది. ఈరోజు కుడి కంటికి కూడా క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నారు. ఈ నెల 28వ తేదీన తిరిగి చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లి లొంగిపోవాల్సి ఉంది.
Next Story

