Wed Jan 28 2026 23:51:47 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు చంద్రబాబుకు వైద్య పరీక్షలు
టీడీపీ అధినేత చంద్రబాబుకు నేడు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నేడు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. గుండె, అలర్జీ సమస్యలపై డాక్టర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక వైద్యం అందించనుంది. అనంతరం ఆయన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి వెళ్లి అక్కడ శస్త్ర చికిత్స చేయించుకుంటారు.
నిన్న హైదరాబాద్ కు...
చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో యాభై రెండు రోజులు పాటు జైలులో ఉండి అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. నిన్న సాయంత్రం ఉండవల్లి నుంచి బయలుదేరిన చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు తనకు ఇష్టమొచ్చిన ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవచ్చని న్యాయస్థానం సూచించడంతో చంద్రబాబు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్ర చికిత్స చేయించుకుంటున్నారు.
Next Story

