Thu Mar 19 2026 05:35:49 GMT+0530 (India Standard Time)
ఈ నెల 14న నెల్లూరులో మినీ మహానాడు
ఈ నెల 14 నెల్లూరు జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. ఆయన కోవూరు నియోజకవర్గంలో జరిగే మినీ మహానాడులో పాల్గొంటారు

ఈ నెల 14న నెల్లూరు జిల్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. ఆయన కోవూరు నియోజకవర్గంలో జరిగే మినీ మహానాడులో పాల్గొంటారు. టీడీపీ ఆవిర్భవించి నలభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో మినీ మహానాడులు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షాల కారణంగా మినీ మహానాడులను కొంతకాలం పాటు వాయిదా వేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ నుంచి మినీ మహానాడులు ప్రారంభం కానున్నాయి.
బాదుడే బాదుడు...
నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గంలో ఈ నెల 14న మినీ మహానాడు జరగనుంది. 15వ తేదీన నెల్లూరులో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమీక్షించనున్నారు. 16వ తేదీన వెంకటగిరి, కాళహస్తి నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతుందని, రోడ్ షో లో చంద్రబాబు పాల్గొంటారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story

