Fri Mar 20 2026 03:18:33 GMT+0530 (India Standard Time)
నేడు ఈస్ట్ గోదావరికి చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నేడు తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తూర్పు గోదావరి జిల్లాకు రానున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వరుపుల రాజా నిన్న రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. వరుపుల రాజా భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులర్పించనున్నారు.
అంతిమయాత్రలో....
మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి చంద్రబాబు ప్రత్తిపాడు చేరుకోనున్నారు. వరుపుల రాజా అంతిమయాత్రలో చంద్రబాబు పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చిన్న వయసులోనే వరుపుల రాజా మరణిచండం బాధాకరమని ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

