Sat Mar 21 2026 10:12:19 GMT+0530 (India Standard Time)
బాబు కుప్పం సభలకు నో పరిష్మన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం పర్యటనలో రోడ్ షోలకు, సభలకు పోలీసులు అనుమతించలేదు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు కుప్పం పర్యటనలో రోడ్ షోలకు, సభలకు పోలీసులు అనుమతించలేదు. అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీస్ శాఖ అధికారులు టీడీపీ నేతలకు నోటీసులు అందంచారు. చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శికి కు నోటీసు ఇచ్చినా సమాధానం రాలేదని పోలీసులు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.
నోటీసులిచ్చి...
అందువల్లనే నేడు కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రోడ్ షోలకు, సభలకు అనుమతించలేదని పోలీసులు పేర్కొన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలను నిర్వహించినా, అందులో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసుల్లో హెచ్చరించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ను మార్చినప్పటికీ పోలీసులు మాత్రం రోడ్ షోలకు, సభలకు అనుమతి నిరాకరించారు. మరి చంద్రబాబు కుప్పం పర్యటన ఈరోజు ఎలా సాగుతుందనేది ఉత్కంఠగా మారింది.
Next Story

