Thu Jan 29 2026 18:39:35 GMT+0000 (Coordinated Universal Time)
వివేకాహత్య దేశానికి ఒక కేస్ స్టడీ
వివేకా హత్య కేసు భారతదేశానికి కేస్ స్టడీ వంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

వివేకా హత్య కేసు భారతదేశానికి కేస్ స్టడీ వంటిదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కడప జోన్ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.నాయకులు ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తీసుకురావాలని కోరారు. నియోజకవర్గ ఇంఛార్జులు, ఆయా గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని పిలుపు నిచ్చారు. టీడిపీ నాయకులు, కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే అన్ని సీట్లు వచ్చేలా ఉన్నాయని నవ్వుతూ చంద్రబాబు అన్నారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడు ముందు ఉంటుందన్న చంద్రబాబు కార్యకర్తల కుటుంబ సంక్షేమం, ఆరోగ్యం కోసం యాప్ను ప్రవేశపెట్టామన్నారు. అనారోగ్యం వస్తే ఖర్చు పెట్టుకోలేని కార్యకర్తలకు అన్ని ఖర్చులు టీడీపీ భరించేలా ఆలోచన చేస్తున్నామని చెప్పారు.
పార్టీ బలోపేతానికి...
అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులు పెట్టించి ఆనందపడే జగన్కు ఇదే ఆఖరి అవకాశం అని అధినేత చంద్రబాబు అన్నారు. కేసులు పెడితే దీటుగా సమాధానం ఇచ్చే పార్టీ టీడీపీ మాత్రమేనని అన్నారు. కేసులుపెట్టి మనల్ని నిర్భందిస్తే, పదిమందిని చంపితే దాడులు చేస్తే భయపడతారని వైసీపీ నాయకులు అనుకుంటున్నారని, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు అన్నారు. ప్రతిదీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని, ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో ఓట్లు ఎలా వచ్చాయని తెలుసుకుని బలోపేతానికి పార్టీ అభివృద్ధి కోసం శ్రీకారం చుట్టామని చంద్రబాబు తెలిపారు.
Next Story

