Fri Dec 05 2025 19:16:37 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంక ప్రజల కంటే ఏపీవాసులకు ఓర్పు ఎక్కువ
శ్రీలంక ప్రజల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓర్పు ఎక్కువని, అందుకే తిరగుబాటు చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

శ్రీలంక ప్రజల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓర్పు ఎక్కువని, అందుకే తిరగుబాటు చేయడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించార. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు అక్కడి వరద బాధితులతో మాట్లాడారు. దేశంలోనే అధిక ధరలకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారన్నారు. సామాన్యులు తట్టుకునే స్థాయిలో ధరలు లేవన్నారు. దేశంలో అప్పులు ఎక్కువగా చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును మళ్లీ వెనక్కు తీసుకెళ్లేలా ఈ ప్రభుత్వం పనులు చేస్తుందని చంద్రబాబు అన్నారు
తిరగబడాల్సిందే...
ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులను పెట్టడమే ఈ ప్రభుత్వానికి చేతనయిన పని అని ఆయన విమర్శించారు. విలీనం పేరుతో పాఠశాలలను మూసి వేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అయితే ప్రజలకు అన్నయాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తామని, కేసులకు టీడీపీ భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
Next Story

