Thu Mar 19 2026 07:43:41 GMT+0530 (India Standard Time)
బలమైన బీసీల అణిచివేతకే?
జగన్ ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

జగన్ ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ కూల్చివేతపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని అన్నారు. బలమైన బీసీ నేతలను జగన్ రెడ్డి లక్ష్యంగా చేసుకున్నారన్నారు. చోడవరం మినీ మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకు నిరసనగా అయ్యన్న ఇంటిపై దాడులకు దిగారని చంద్రబాబు అన్నారు.
తెల్లవారు జాము నుంచి....
అయ్యన్న పాత్రుడు ఇంటిపై ఈరోజు తెల్లవారు జాము నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు మొహరించి ఇంటి గోడను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అయ్యన్న అడిగిన ప్రశ్నల్లో ఏ ఒక్కదానికీ జవాబు చెప్పే పరిస్థితిలో వైసీపీ నేతలు లేరన్నారు. అయ్యన్న పాత్రుడికి పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.
Next Story

