Sat Mar 21 2026 15:02:33 GMT+0530 (India Standard Time)
అందుకే అమరరాజా బ్యాటరీస్ వెళ్లిపోయింది
ఆంధ్రప్రదేశ్ నుంచి అమరరాజా బ్యాటరీస్ యూనిట్ వెళ్లిపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ఆంధ్రప్రదేశ్ నుంచి అమరరాజా బ్యాటరీస్ యూనిట్ వెళ్లిపోవడానికి వైసీపీ ప్రభుత్వ వైఖరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టెర్రరిజం నడుస్తుందన్నారు. ప్రభుత్వం పరిశ్రమలను బెదిరించడం వల్లనే అనేక పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని ఆయన అన్నారు. తొలిసారి సొంత రాష్ట్రం వదిలి 9,500 కోట్ల పెట్టుబడిని పక్క రాష్ట్రంలో అమరరాజా కంపెనీ పెట్టడానికి కారణం జగన్ ప్రభుత్వ బెదిరింపుల వల్లనేనని ఆయన అన్నారు.
కక్ష సాధింపు ధోరణితో...
పరిశ్రమలను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం భూములను వెనక్కు తీసుకుంటానంటే ఎవరు మాత్రం ఉంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనేక తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతూ పరిశ్రమ యాజమాన్యాన్ని టార్చర్ కు గురి చేశారని అన్నారు. రాజకీయ కక్షతోనే అమరరాజా కంపెనీ తెలంగాణకు వెళ్లిపోయిందన్నారు. అమరరాజా బ్యాటరీ కొత్తగా లిథియం ఐయాన్ బ్యాటరీ ఉత్పత్తులను మన రాష్ట్రంలో చేసి ఉంటే వేల మందికి ఉపాధి లభించే అవకాశం దక్కేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైైనా ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు.
Next Story

