Fri Dec 26 2025 22:31:38 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నుంచి మరికొందరు త్వరలోనే
వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక పై టీడీపీ అన్స్టాపబుల్ అని ఆయన చెప్పారు

వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయమని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇక పై టీడీపీ అన్స్టాపబుల్ అని ఆయన చెప్పారు. స్పీడ్ ఇక మరింత పెంచనున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లా వైసీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంచుమర్తి అనూరాధ గెలుపుతో వైసీపీకి చెమటలు పట్టాయన్నారు. 23వ తేదీన, 23వ సంవత్సరం, 23 మంది టీడీపీకి ఓటేసి గెలిపించారని అన్నారు. దేవుడు స్క్రిప్ట్ మార్చాడని, జగన్ ఇక కాచుకో అంటూ సవాల్ విసిరారు.
గెలుపు మనదే....
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని ముప్ఫయి ఏళ్ల వెనక్కు నెట్టాడని, ప్రజలు వీటిని గమనించి వరస విజయాలు పార్టీకి అందిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని, ఈసారి టీడీపీ ప్రభుత్వంలో పైరవీలకు అవకాశముండదని తెలిపారు. జగన్ పై అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని వారంతా త్వరలోనే బయటకు వస్తారని చంద్రబాబు అన్నారు.
Next Story

