Fri Dec 05 2025 23:13:58 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీలో తిరుగుబాటు మొదలయింది : చంద్రబాబు
ఎమ్మెల్యేలను, మంత్రులను బదిలీ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ఎమ్మెల్యేలను, మంత్రులను బదిలీ చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పొన్నూరులో జరిగిన సభలో మాట్లాడుతూ వైసీపీలో తిరుగుబాటు ప్రారంభమయిందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడే ఖాళీ అవుతుందని, టీడీపీ గేట్లు ఓపెన్ చేస్తే సగం ఖాళీ అవుతుందని, ఎన్నికల తర్వాత మొత్తం వైసీపీ ఖాళీ అవుతుందని ఆయన అన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలాడి రోశయ్య గ్రావెల్ రోశయ్యగా మారిపోయాడన్నారు. ఏడు వందల ఎకరాల్లో రెండు వందల కోట్ల రూపాయల మేర విలువైన గ్రావెల్ తరలించాడన్నారు.
నమ్మి వెళితే...
చివరకు సంగం డెయిరీని కూడా మూసివేయడానికి ప్రయత్నించారన్నారు. నరేంద్రను జైల్లో పెట్టారని, తాము అధికారంలోకి రాగానే చక్రవడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. అందరం బాధితులమేనని, మరలా జగన్ గెలిస్తే అందరం బానిసలవుతామని హెచ్చరించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని జగన్ పావుగా ఉపయోగించుకుని టిక్కెట్ ఇవ్వకుండా బయటపడేశారన్నారు. నమ్మకద్రోహి నెంబరు వన్ జగన్ అని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నమ్మి వెళితే చివరకు టిక్కెట్ ఇవ్వకుండా కాదు పొమ్మన్నాడని అన్నారు. పింఛన్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు. ఒకటో తేదీన మీ ఇంటి వద్దకు నేరుగా పింఛను ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు.
Next Story

