Fri Dec 05 2025 23:53:50 GMT+0000 (Coordinated Universal Time)
వరద బాధితులకు బాబు అండ
వరదల్లో మరణించిన వారికి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం పార్టీ తరుపున అందచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు

వరదల్లో మరణించిన వారికి కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారం పార్టీ తరుపున అందచేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు కడప జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల వల్ల నష్టపోయిన వారికి వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ముందు జాగ్రత్త చర్యలు....?
ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రాణ, ఆస్తినష్టం ఎక్కువగా సంభవించిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి పరిహార ప్రకటించిన జగన్ వరదల్లో మరణించిన వారికి ఐదు లక్షల పరిహారం చెల్లించడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు. ఐదు లక్షల పరిహారం ఇవ్వడమేంటని నిలదీశారు. వరదల్లో మృతి చెందిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story

