Thu Mar 19 2026 01:42:37 GMT+0530 (India Standard Time)
జగన్ మానసిక స్థితి బాగా లేదు
జగన్ మానసికస్థితి బాగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు.

జగన్ మానసికస్థితి బాగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. మానసికస్థితి బాగాలేని వారు పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు. అందుకే తప్పుడు నిర్ణయాలు, తిరిగి వెనక్కు తీసుకోవడాలు చేస్తున్నారన్నారు. జగన్ సీఎంగా ఉంటే అందరికీ ఇబ్బందేనని అన్నారు. తనకు, తన పార్టీ నేతలకు ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంటాయని, అయినా భయపడబోమని చంద్రబాబు తెలిపారు.
కేసులకు భయపడేది లేదు...
రైతుల గురించి జగన్ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తాము భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ఈ అవినీతి, చేతకాని ప్రభుత్వంపై ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ అండగా ఉంటుందని క్యాడర్ కు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వంపై తాను పోరాటం చేసేందుకే ప్రజాక్షేత్రంలోకి వచ్చానని చంద్రబాబు చెప్పారు.
Next Story

