Thu Mar 19 2026 16:24:16 GMT+0530 (India Standard Time)
వైసీపీ సర్కార్ పై చంద్రబాబు ఆగ్రహం
ఏపీలో గురుకుల పాఠశాలలకు ఉన్న లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు

ఏపీలో గురుకుల పాఠశాలలకు ఉన్న లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి పేరును తొలగించడం సరికాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బాలయోగి పేరును తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది దళితులను అవమానించడమేనని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్, వైఎస్ పేరుతో ఉన్న కార్యక్రమాలను తొలగించి అంబేద్కర్ పేరు పెడితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్నారు.
బాలయోగి పేరును....
దళితుల కోసం కృషి చేసిన బాలయోగి పేరును తొలగించడం సరికాదని చంద్రబాబు అన్నారు. కొత్త జిల్లాలకు బాలయోగి పేరు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ కుసంస్కారాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. బాలయోగి పేరును కొనసాగిస్తూ జగన్ నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
Next Story

