Sun Mar 22 2026 22:47:03 GMT+0530 (India Standard Time)
ఇంతటి బాధ్యత లేని ప్రభుత్వం?
ఇటువంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు

ఇటువంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాటుసారా మరణాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా? కనీసం దానిపై చర్చ కూడా పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడలేదని చంద్రబాబు అన్నారు. అక్రమ మద్యం వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళతామని చంద్రబాబు చెప్పారు. ఇంతటి బాధ్యత లేని ప్రభుత్వం తాను ఇంతవరకూ చూడలేదన్నారు.
పోలవరం ప్రాజెక్టు...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదని చెప్పారు. డయా ఫ్రం వాల్ ఎప్పటిలోగా పూర్తి చేసి నీళ్లు ఇస్తారో జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పట్ల జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని చెప్పారు. నీతి మాలిన చీకటి వ్యాపారం కోసం ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని చెప్పారు. కాగా తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఆయన లోగోను విడుదల చేశారు. టీడీపీ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. టీడీపీ నలభై ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.
Next Story

