Thu Jan 16 2025 02:08:55 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తోడ బుట్టిన చెల్లెల్ని అనే మాటలా ఇవి?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పులివెందులలో జగన్ చేసిన ప్రసంగాన్ని తప్పుపడుతూ చంద్రబాబు ఎక్స్ లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా...మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.
ఎంత నీచమంటూ...
ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ లో పోస్టు పెట్టారు. జగన్ పులివెందుల సభలో పసుపు చీర కట్టుకుని ప్రత్యర్థుల వద్ద మోకరిల్లారంటూ వైఎస్ షర్మిలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. తనపై కుట్రకు పాల్పడ్డారన్న జగన్ విమర్శలపై చంద్రబాబు పై విధంగా స్పందించారు.
Next Story