Wed Dec 17 2025 06:48:07 GMT+0000 (Coordinated Universal Time)
ఆమె కన్నీళ్లుతుడిచిన చంద్రబాబు
శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మునిరాజమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్థికసాయం అందచేశారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మునిరాజమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు ఆర్థికసాయం అందచేశారు. కొద్దిరోజుల క్రితం నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తన బాధలు చెప్పుకున్న మునిరాజమ్మపై శ్రీకాళహస్తిలో వైసీపీ గూండాలు దాడి చేశారని ఆమె ఆరోపించారరు. మునిరాజమ్మ హోటల్ ను ధ్వంసం చేశారు. తనకున్న ఒక్క ఆసరా హోటల్ ను ధ్వంసం చేశారని చెబుతూ ఆమె చంద్రబాబు ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియో...
మునిరాజప్ప కన్నీళ్లుతుడిచిన చంద్రబాబు ఆమెకు ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఆరోగ్య సమస్యలనున్న పిల్లలతో తాను కుటుంబాన్ని వెళ్లదీస్తున్నానని, అయితే తనకున్న ఆధారాన్ని వైసీపీ నేతలు ధ్వంసం చేశారని చెప్పారు. మునిరాజప్పకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని ఆమెకు భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని మునిరాజమ్మకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అక్రమ కేసులు, వైసీపీ బెదిరింపులకు భయపడవద్దని మునిరాజప్పకు సూచించారు. ఏ ఇబ్బందులు తలెత్తినా పార్టీ నేతలకు వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పారు.
Next Story

