Sun Mar 15 2026 21:32:51 GMT+0530 (India Standard Time)
Nara Bhuvaneshwari:నేడు శ్రీసత్యసాయి జిల్లాకు నారా భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. పుట్టపుర్తి రూరల్ మండలం, నిడుమామిడి గ్రామంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు. గుజుకుంటపల్లి గ్రామం, ఓబుళదేవచెరువు మండలంలోనూ కార్యకర్త కుటుంబాన్ని ఆమె పరామర్శించనున్నారు.
నిజం గెలవాలి కార్యక్రమానికి...
అనంతరం కదిరి నియోజకవర్గంలోనూ నారా భువనేశ్వరి పర్యటిస్తారు. అక్కడ కొర్తికోట గ్రామంలోనూ, కదిరి రూరతల్ మండలంలోనూ కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లినప్పుడు అతి తట్టుకోలేక మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరిశీలించి వారికి భరోసాను ఇవ్వనున్నారు.
Next Story

