Wed Dec 17 2025 14:15:06 GMT+0000 (Coordinated Universal Time)
చిన్నారికి పేరు పెట్టిన భువనేశ్వరి
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. నిజం గెలవాలి కార్యక్రమం కింద హిందూపురంలో పర్యటిస్తున్నారు. అయితే ఆమె పర్యటనలో ఒక చిన్నారికి పేరు పెట్టారు. సింగనమల గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త హేమంత్ యాదవ్, శోభాయాదవ్ దంపతులకు జన్మించిన మగ పిల్లాడికి పేరు పెట్టాలని దంపతులు నారా భువనేశ్వరిని కోరారు.
నిజం గెలవాలి కార్యక్రమంలో...
హిందూపురం లో నిజం గెలవాలి కార్యక్రమం వద్దకు తమ బిడ్డతో వచ్చిన హేమంత్ యాదవ్ దంపతులు తమ బిడ్డకు నామకరణం చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన నారా భువనేశ్వరి కుశల్ కృష్ణ అని నామకరణం చేశారు. తమబిడ్డకు భువనేశ్వరి నామకరణం చేయడం పట్ల హేమంత్ యాదవ్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.
Next Story

