Sun Mar 15 2026 21:32:51 GMT+0530 (India Standard Time)
Nara Bhuvaneshwari:నేడు కుప్పంలో భువనేశ్వరి పర్యటన
నేడు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు

Nara Bhuvaneshwari:నేడు కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కుప్పం నియోజకవర్గంలో పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు భువనేశ్వరికి ఘనంగా స్వాగతం పలికారు.
నిజం గెలవాలి పేరుతో...
కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి ఈరోజు మూడు అన్నా క్యాంటిన్లను ప్రారంభించనున్నారు. దీంతో పాటు నిజం గెలవాలి పేరుతో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో అరెస్టయి రాజమండ్రి జైలుకు వెళ్లినప్పుడు అనేక మంది మరణించారు. మరణించిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి మూడు లక్షల రూపాయల చెక్కు ను అందచేయనున్నారు.
Next Story

