Fri Dec 05 2025 10:26:31 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటన
ఈ నెల 22వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు

ఈ నెల 22వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు తెలిపారు. మొత్తం మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలోని మూడు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
మూడు నియోజకవర్గాల్లో...
ఈ నెల 22న గజపతినగరం, 23న బొబ్బిలి, 24న రాజాం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బొబ్బిలి, రాజాంలలో ఆయన రాత్రి బస చేస్తారని చెప్పారు. చంద్రబాబు పర్యటన విజయవంతం చేయడానికి పార్టీ నేతలు ముందస్తు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
Next Story

