Fri Dec 05 2025 17:39:49 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు ఉరవకొండకు చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నేడు అనంతపురం జిల్లా ఉరకొండలో పర్యటించనున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లా ఉరకొండలో పర్యటించనున్నారు. రా కదలిరా సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాలు, తాము అధికారంలోకి వస్తే ఏం చేయనున్నామన్నది చంద్రబాబు ప్రజలకు వివరించనున్నారు. చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకకు అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపుల బయలు గ్రామం నుంచి బయలుదేరి 3.40 గంటలకు ఉరవకొండ లత్తవరం గ్రామానికి చేరుకుంటారు.
రాత్రికి ఉరవకొండలోనే...
సాయంత్రం నాలుగు గంటల నుంచి 5.30 గంటల వరకూ అక్కడ జరిగే సభలో పాల్గొంటారు. రాత్రికి ఉరవకొండలో బసచేయనున్న చంద్రబాబు రేపు ఉదయం పది గంటలకు నెల్లూరు బయలుదేరి వెళతారు. చంద్రబాబు సభ కోసం టీడీపీ నేతలు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత కొద్ది రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాలలో చంద్రబాబు రా కదలిరా సభ లను పెట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడమే కాకుండా క్యాడర్ లో జోష్ నింపుతున్నారు.
Next Story

