Thu Mar 19 2026 04:11:40 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు రెండు నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లాలో ఆయన పర్యటన సాగనుంది. ప్రజాగళం సభల్లో ఆయన పాల్గొంటారు. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న సమయంలో చంద్రబాబు ముఖ్యమైన నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి వరసగా ప్రజాగళం పేరిట సభలు నిర్వహిస్తూ ఆయన జనంలోకి సూపర్ సిక్స్ మ్యానిఫేస్టోను తీసుకెళుతున్నారు.
ఆత్మకూరు, కోవూరులలో...
ఈరోజు నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డికి మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. అనంతరం కోవూరు నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొంటారు. అక్కడ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి మద్దతుగా ఆయన పాల్గొంటారు. చంద్రబాబు అనంతరం నెల్లూరు జిల్లా నేతలతో సమావేశమై రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

