Thu Mar 19 2026 08:51:15 GMT+0530 (India Standard Time)
Chandrababu : నేడు ఉండవల్లికి చంద్రబాబు
నేడు ఉండవల్లి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు

నేడు ఉండవల్లి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రానున్నారు. విదేశీపర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు గత మూడు రోజుల నుంచి హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన నిన్న తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఆయన చర్చించారు.
కీలక నేతలతో భేటీ...
ఈరోజు ఆయన విజయవాడకు చేరుకుంటారు. జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ఉండనుండటంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీడీపీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన విషయాలపై ఆయననేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
Next Story

