Mon Dec 08 2025 13:07:20 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని నిన్న ముగించుకున్న తర్వాత తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని నిన్న ముగించుకున్న తర్వాత తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆయన చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని తిరుమలకు చేరుకున్నారు. ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు.
ప్రచారంలో ఉన్న చంద్రబాబు...
గత కొద్దిరోజులుగా ఏడు పదుల వయసులో మండే ఎండలలో ప్రచారాన్ని నిర్వహించిన చంద్రబాబు నాయుడు స్వామి వారి సన్నిధిలో రాత్రి సేదతీరారు. ప్రచారంలో నిర్వహించి అలసట చెందిన ఆయన చివరిగా తిరుమలకు దర్శించుకుని తన కులదైవమైన శ్రీవారిని సందర్శించి ప్రార్థించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు.
Next Story

