Sun Feb 01 2026 20:03:34 GMT+0000 (Coordinated Universal Time)
ఓటమి భయంతోనే దాడులు : చంద్రబాబు
ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒంగోలులో ప్రభుత్వం ఇచ్చే పారితోషికం తీసుకుంటూ పార్టీ ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ ను ప్రశ్నించిన ప్రభావతి కుటుంబాన్ని వైసీపీ రౌడీమూక చంపేస్తామని బెదిరించిందని, ఆ కుటుంబానికి అండగా నిలిచిన టీడీపీ నేత మోహన్ పై మూకుమ్మడి దాడి చేశారని మండిపడ్డారు.
పోలీసులు కూడా...
గాయపడిన మోహన్ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లగా అక్కడా బీభత్సం సృష్టించి ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. వైసీపీ దౌర్జన్యాలను తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో పోలీసులు ఘటనా స్థలంలో ఉన్నప్పటికీ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం పోలీసు అధికారుల వైఖరి ఏంటో తెలియజేస్తోందన్నారు. దాడికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డే కారణమని ఆరోపించారు.
Next Story

