Wed Mar 18 2026 16:38:04 GMT+0530 (India Standard Time)
పొత్తులపై చంద్రబాబు స్పందన ఇదే
పొత్తులపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వచ్చే ఎన్నికలలో అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుందన్నారు

పొత్తులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. వచ్చే ఎన్నికలలో అవసరాన్ని బట్టి పొత్తుల నిర్ణయం ఉంటుందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
ఇకపై ఏ ఎన్నిక వచ్చినా గెలవాల్సిందే...
రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి పొత్తులు ఉంటాయన్నారు. ఇకపై ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేసి గెలవాల్సిందే అని చంద్రబాబు పార్టీ నేతలకు చంద్రబాబు పిలుపు నిచ్చారు. నేతలు నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు నిరంతరం ప్రయత్నించాలన్నారు. ఏదైనా ఇప్పుడే దానిపై ఆలోచించేందుకు సమయం కాదని, ముందు ముందు దీనిపై తానే స్పష్గత ఇస్తానని చంద్రబాబు తెలిపారు.
Next Story

