Fri Mar 20 2026 03:16:25 GMT+0530 (India Standard Time)
రాజా కుటుంబానికి బాబు ఓదార్పు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు చేరుకుని పార్టీ నేత వరుపుల రాజా భౌతిక కాయానికి నివాళులర్పించారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్తిపాడు చేరుకుని పార్టీ నేత వరుపుల రాజా భౌతిక కాయానికి నివాళులర్పించారు. రాజా లేని లోటు తీర్చలేదని పేర్కొన్నారు. చిన్న వయసులోనే రాజా మృతి చెందడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులకు...
అనంతరం కుటుంబ సభ్యులను కలసి ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్న ధైర్యాన్ని కల్పించారు. రాజా ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాక్షించారు.
Next Story

