Sun Mar 15 2026 07:19:19 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. ఈరోజు నాలుగు గంటలకు
ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాల నకళ్లను దహనం చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ శనివారం సాయంత్రం నాలుగు గంటలకు వీధుల్లోకి వచ్చి పట్టాదారు పాస్ పుస్తకాల నకళ్లను తగులపెట్టాలని కోరారు.
పాస్ పుస్తకాలను...
జగన్ ఫొటోలు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను తగులపెట్టాలని చంద్రబాబు కోరారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాగానే అసైన్మెంట్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేస్తానని, తన రెండో సంతకం కూడా ఆ ఫైలు పైనే ఉంటుందని చంద్రబాబు అన్నారు. భూములను అప్పనంగా దోచుకోవడానికే జగన్ ఈ చట్టాన్ని తీసుకు వచ్చారని చంద్రబాబు ఆరోపించారు.
Next Story

