Fri Dec 05 2025 15:20:05 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : దగ్గుబాటికి ఒక్కరికే కాదు.. ఆ ఎమ్మెల్యేలందరికీ చంద్రబాబు షాక్ ట్రీట్ మెంట్ రెడీ
అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు.

అనంతపురం పట్టణ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభలో స్థానిక ఎమ్మెల్యే భాగస్వామ్యం ఏ మాత్రం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. చంద్రబాబు నాయుడు దగ్గుబాటి వంటి నేతలను పక్కన పెట్టేందుకు సిద్ధమయినట్లు కనపడుతుంది. కేవలం పదిహేను నెలల్లోనే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఏ ఎమ్మెల్యే విషయంలోనూ ఇక ఉదారంగా వ్యవహరించకూడదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. అందుకు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు తొలుత షాక్ ఇచ్చారని పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది.
వివాదాన్ని కొని తెచ్చుకుంటున్న...
వివాదాన్ని కొని తెచ్చుకుంటున్న ఎమ్మెల్యేలను దూరం పెట్టడమే మంచిదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసైడ్ అయినట్లుంది. అందుకే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు చెందిన నియోజకవర్గంలోనే మూడున్నర లక్షల మందితో భారీ బహిరంగసభ జరిగినా అందుకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలోనూ ఆయనను దూరంగా ఉంచడంతో షాక్ ట్రీట్ మెంట్ కు చంద్రబాబు రెడీ అయ్యారని పార్టీలో వినికిడి. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ సభ ఏర్పాట్లను అనంతపురం జిల్లాలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు,మంత్రులు, దేవినేని ఉమ, వంటి వారకు మాత్రమే పర్యవేక్షించారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ను ఏ విషయంలోనూ ఇన్ వాల్వ్ చేయకపోవడంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా దారిలో పడతారని చంద్రబాబు ఈ మార్గాన్నిఎంచుకున్నట్లు కనపడుతుంది.
అనేక సార్లు హెచ్చరించినా...
దగ్గుబాటి ప్రసాద్ పార్టీ హైకమాండ్ కు మరింత దగ్గరయి అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తన ప్రత్యర్ధులకు చెక్ పెట్టాలనుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను దూషించడంతో్ పాటు నియోజకవర్గంలో పార్టీ నేతలను కలుపుకుని పోకపోవడం కూడా చంద్రబాబు ఆగ్రహానికి కారణమని అంటున్నారు. పిలిచి టిక్కెట్ ఇచ్చినా, తొలిసారి ఎమ్మెల్యేల అయిన తర్వాత పార్టీలో సీనియర్ నేతలను దూరంగా పెడుతుండటంతో పాటు వివాదాల్లో చిక్కుకోవడంతో దగ్గుబాటి ప్రసాద్ ను అనేక సార్లు చంద్రబాబు హెచ్చరించారు. అయినా ఫలితం లేదని తెలిసిన తర్వాత మాత్రమే చంద్రబాబు దగ్గుబాటిని దూరం పెట్టారని, అనంంతపురం సభలో కనీసం పలకరించడం, ఆయన పేరు ప్రస్తావించడం చేయకపోవడాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. దగ్గుబాటిని చూసైనా మిగిలిన ఎమ్మెల్యేలు కంట్రోల్ లోకి వస్తారని భావిస్తున్నారు. మరి ఎమ్మెల్యేలు దారికొస్తారా? లేదా? అన్నది చూడాలి.
Next Story

