Sat Dec 06 2025 04:23:19 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జగన్ కు ఎందుకు ఓటేయాలో చెప్పండి?
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీది సామాజిక న్యాయమని, జగన్ ది సామాజిక ద్రోహమని అన్నారు. డోన్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు జగన్ ఒక్క నీటి చుక్క అయినా తెచ్చారా? అంటూ ప్రశ్నించారు. సీమకు న్యాయం చేయని జగన్ కు ఎందుకు ఓటు వేయాలన్నారు చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ రైతుల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజల భూములను జగన్ పేరుతో రాసుకుంటున్నారని అన్నారు.
రైతులను మోసం చేసి...
పట్టాదారుపాసు పుస్తకంపై జగన్ ఫొటో వేసుకోవడం ఎందుకంటూ ఆయన మండిపడ్డారు. భవనాలకు రంగులు మారుస్తూ వేల కోట్ల అవినీతికి ఈ జగన్ పాల్పడ్డారన్నారు. ఆరోగ్య శ్రీకి పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయీలు పెట్టి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారన్నారు. రైతులకు జగన్ పాలనలో న్యాయం జరగలేదన్న చంద్రబాబు రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని అన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు.
Next Story

