Wed Dec 24 2025 12:22:23 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు వినిపించేలా టీడీపీ "మోత" నేడే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు రాత్రి పళ్లేలతో మోగించాలని పిలుపు నిచ్చారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు రాత్రి పళ్లేలతో మోగించాలని పిలుపు నిచ్చారు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ప్లేట్లతో మోత మోగించాలని నారా బ్రాహ్మణి కూడా పిలుపు నిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పళ్లేలతో ఆ సమయంలో మోగించి నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయించింది.
వాహనాల్లో ఉన్న వారు...
తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్ కు వినిపించేలా ప్రజలంతా మూకుమ్మడిగా చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బయట వాహనాల్లో ఉన్న వాళ్లు ఐదు నిమిషాల పాటు హారన్ మోగించి తమ నిరసనను తెలియజేయాలని పేర్కొంది. ఇల్లు, కార్యాలయంతో సంబంధం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా బ్రాహ్మణి పిలుపు నిచ్చారు.
Next Story

