Mon Jan 20 2025 15:55:45 GMT+0000 (Coordinated Universal Time)
క్లారిటీ వచ్చేసింది.. పర్యటన ఖరారైంది
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఖరారైంది. చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీతో పొత్తు విషయమై ఢిల్లీలో పలువురు నేతలతో కీలక చర్చలు జరపనున్నారు. బుధవారం నాడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. కూటమికి సంబంధించి.. రెండో జాబితాలోని అభ్యర్థుల విషయమై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. బుధవారం ఉదయమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోము వీర్రాజు ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ ఇప్పటికే 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించగా, జేఎస్పీ తనకు కేటాయించిన 24 నియోజకవర్గాల్లో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడు లోక్సభ నియోజకవర్గాల్లో JSP పోటీ చేయబోతోంది. మిగిలిన సీట్లకు సంబంధించి త్వరలోనే ఓ క్లారిటీ రానుంది.
Next Story