Sun Mar 15 2026 06:30:33 GMT+0530 (India Standard Time)
Chandrababu : మృతులకు చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పదిమంది మృతి చెందడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఎం.కొంగవరం, కృష్ణాజిల్లా కోడూరుపాడు, కాకినాడ జిల్లా రాయవరం వద్ద జరిగిన ప్రమాదాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సరైన వైద్యం అందించాలని...
గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు. మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని ప్రకటించారు.
Next Story

