Sat Dec 06 2025 11:20:33 GMT+0000 (Coordinated Universal Time)
దేశంలో అత్యంత సంపన్న సీఎం జగన్ : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే సైకో పాలన పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన ప్రాంతీయ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ పాలనలో అనేక వర్గాలపై దాడులు పెరిగాయని, ఎస్సీలపై కూడా దాడులు చేస్తూ సైకోల్లా వ్యవహరిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎస్సీల అభివృద్ధి కోసం పనిచేస్తుందని ఆయన అన్నారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
గెలుపుతో ఉత్సాహం...
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, ఈ గెలుపు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. చివరకు కడపలో కూడా గెలవడం సంతోషంగా ఉందన్న చంద్రబాబు ఈ గెలుపు దెబ్బకు జగన్ మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్యేలను సముదాయించుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలను బతిమాలుకునే పరిస్థితికి జగన్ వచ్చాడని తెలిపారు. విశాఖలో తనకు ఇల్లు లేదని, తాను ఎన్నడూ భూములు ఆక్రమించలేదని తెలిపారు. అధికారంలోకి రాగానే విశాఖ భూ ఆక్రమణలపై విచారణ జరుపుతామని చెప్పారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ అని ఆయన అన్నారు.
Next Story

