Sun Mar 22 2026 21:14:54 GMT+0530 (India Standard Time)
ఎవరికీ మినహాయింపుల్లేవ్.. సీరియస్ అయిన బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు.ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని నేతలపై ఆయన మండి పడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. టీడీపీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని నేతలపై ఆయన మండి పడ్డారు. ఇటీవల ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో నిరసన కార్యక్రమం చేపట్టాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి క్యాండిల్, అగ్గిపెట్టె, కరపత్రాలను అందచేయాలని ఆదేశించారు.
సీఎం పదవి నుంచి పీకేందుకు....
ఈ కార్యక్రమాల్లో లోకేష్, అచ్చెన్నాయుడు తదితరులు కూడా కొన్ని జిల్లాల్లో పాల్గొంటారు. కానీ కొందరు నియోజకవర్గ ఇన్ ఛార్జులు ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి మినహాయింపులు ఉండబోవని హెచ్చరించారు. విద్యుత్తు కోతలు, పెంచిన ఛార్జీలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని, సీఎం పదవి నుంచి పీకేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.
Next Story

