Sun Jan 12 2025 21:46:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నేడు ఉమ్మడి ప్రచారంలో పాల్గొననున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు నేడు ఉమ్మడి ప్రచారంలో పాల్గొననున్నారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇరువురు పర్యటించనున్నారు. ప్రజాగళం సభల్లో ఇద్దరు పాల్గొననున్నారు. ఇద్దరు కలసి ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగిన ప్రజాగళం సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
పెడన, మచిలీపట్నం...
నేడు కోస్తాంధ్ర ప్రాంతమైన కృష్ణా జిల్లాలో ఇద్దరు నేతలు పర్యటించనున్నారు. నేడు మచిలీపట్నం, పెడన నియోజకవర్గంలో ఇద్దరూ పర్యటన చేస్తారు. ఇద్దరు నేతలు కలసి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో ఓట్లు బదిలీ అయ్యేలా చూసేందుకు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో స్థానిక బీజేపీ నేతలు కూడా పాల్గొననున్నారు.
Next Story