Mon Mar 16 2026 18:03:43 GMT+0530 (India Standard Time)
TDP Janasena Election campaign: నేడు చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని పుంగనూరు నియోజకవర్గంలో ఇద్దరు కలసి పర్యటించి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తారు. అనంతరం తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
అభ్యర్థులకు మద్దతుగా...
ఇద్దరు నేతలు కలసి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగళం సభలో ఇద్దరు పాల్గొని రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరనున్నారు. తమ మ్యానిఫేస్టోను వివరించడంతో పాటు గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను వివరించనున్నారు. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోవాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరనున్నారు.
Next Story

