Thu Mar 19 2026 04:14:04 GMT+0530 (India Standard Time)
Chandrababu : ఉమ్మడి ప్రచారం నేటి నుంచి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలసి నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. గోదావరి జిల్లాలో వారవు పర్యటించనున్నారు. ఇద్దరూ కలసి రంెడు నియోజవకర్గాల్లో నేడు ప్రచారాన్ని నిర్వహించనున్నారు. కూటమి ఏర్పడిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో మరొక సారి ఇద్దరు నేతలు కలసి పర్యటిస్తుండటంతో పార్టీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంతో ఇద్దరూ ప్రచారాన్ని నేడు, రేపు నిర్వహించనున్నారు.
నేడు, రేపు...
ఈరోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పవన్, చంద్రబాబు పాల్గొననున్నారు. రేపు పి. గన్నవరం, అమలాపురం నియోజకవర్గంలో ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహిస్తారు. రోడ్ షోలో కూడా పాల్గొంటారు. నిడదవోలు సభకు బీజేపీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి కూడా హాజరు కున్నారు. చంద్రబాబు రాత్రికి రాజమండ్రిలోనే బస చేయనున్నారు. దీంతో వీరి సభలకు పెద్దయెత్తున ఏర్పాట్లు మూడు పార్టీల నేతలు చేస్తున్నారు. భారీ జనసమీకరణకు సిద్ధమయ్యారు.
Next Story

