Sun Mar 15 2026 22:07:07 GMT+0530 (India Standard Time)
Chandrababu : రెండు గంటలైనా రాజమండ్రిలోనే చంద్రబాబు
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన విజయవాడ బయలుదేరారు

స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పొందిన చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన విజయవాడ బయలుదేరారు. అయితే చంద్రబాబును చూసేందుకు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు తరలి రావడంతో ఆయన ఇంకా రాజమండ్రి వంతెన కూడా దాటలేదు. ఆయన వాస్తవానికి రెండు గంటల ముందే రాజమండ్రి జైలు నుంచి బయలుదేరారు. రాజమండ్రి నగరం దాటేందుకే చంద్రబాబుకు రెండు గంటల సమయం పట్టింది.
ప్రజలు రోడ్డుపైకి వచ్చి...
తన కాన్వాయ్ నుంచి అభివాదం చేస్తున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి రోడ్లపైన నిల్చున్నారు. దీంతో ఆయన కాన్వాయ్ నిదానంగా సాగుతుంది. ఆయన రాజమండ్రి నుంచి ఉండవల్లికి చేరుకోవాల్సి ఉంది. ఇక దారి మధ్యలో చాలా మంది ప్రజలు చంద్రబాబు రాకకోసం ఎదురు చూస్తుండటంతో ఆయన విజయవాడ చేరుకునేందుకు సమయం అర్థరాత్రి దాటే అవకాశముందని చెబుతున్నారు.
Next Story

