Fri Mar 13 2026 18:04:47 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు షెడ్యూల్ లో మార్పు
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఈరోజు తిరుమలకు వెళ్లాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆయన హైదరాబాద్ వెళుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు వాస్తవానికి ఈరోజు తిరుమలకు వెళ్లాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాల రీత్యా ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళుతున్నారు. ఆయనకు అత్యవసరంగా చికిత్స చేయాలని వైద్యులు సూచించడంతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు మరికాసేపట్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నేరుగా హైదరాబాద్ కు...
ఆయనకు ఏఎంజీ ఆసుపత్రిలో చికిత్స చేస్తారని తెలిసింది. ఇందుకోసం వైద్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్కిల్ డెవలెప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో యాభై రెండు రోజుల పాటు ఉన్న చంద్రబాబుకు అనారోగ్య కారణాల రీత్యా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిన్న విడుదలయిన ఆయన రాజమండ్రి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉండవల్లికి చేరుకున్నారు. ఆయన కుడి కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు సూచించడంతోనే బెయిల్ మంజూరయింది.
Next Story

