Thu Mar 19 2026 16:41:58 GMT+0530 (India Standard Time)
ఈస్ట్ లో చంద్రబాబు పర్యటన
ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు రెడీ అయ్యారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటనలు తిరిగి ప్రారంభించారు. కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు తిరిగి జిల్లాల్లో పర్యటిస్తూ నేతల్లోనూ, క్యాడర్ లోనూ జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకూ అనేక జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. మూడు రోజుల పాటు జిల్లాల్లో పర్యటిస్తూ నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశమవుతూ వస్తున్నారు. చిత్తూరు జిల్లా పర్యటన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు.
మూడు రోజుల పాటు...
ఇప్పుడు తాజాగా ఉమ్మ డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ నెల 14,15,16 తేదీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన జరుగుతుందని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. నియోజకవర్గ నేతలతో సమావేశమై పార్టీ నేతలతో పరిస్థితిపై ఆయన చర్చించనున్నారు. కొన్ని చోట్ల నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు.
Next Story

