Sun Oct 06 2024 00:50:58 GMT+0000 (Coordinated Universal Time)
నవరాత్రులు... జైలులోనే
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో జైలుకెళ్లి తొమ్మిదో రోజుకు చేరుకుంది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో జైలుకెళ్లి తొమ్మిదో రోజుకు చేరుకుంది. రేపు ఆయన బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది. వినాయక చవితి పండగను చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జరుపుకుంటున్నారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉండటంతో ఆయన కుటుంబ సభ్యులందరూ రాజమండ్రిలోనే ఉన్నారు. ఆయనకు ప్రత్యేక భోజనం, మందులను ప్రతిరోజు పంపుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అక్కడే ఉండి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో గత ఆదివారం ఆయన జైలుకు వెళ్లారు.
తొలిసారి జైలుకు...
చంద్రబాబు నాయుడు నలభై పదుల రాజకీయ జీవితంలో తొలి సారి జైలు జీవితం గడుపుతున్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలోని స్నేహ బ్లాకులో ప్రత్యేక భద్రత మధ్య ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడూ ఇన్ని రోజులు రాజకీయంగా ఖాళీగా లేరన్నది పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకూ ఆవేదన చెందుతున్నారు. ఆయనపై అక్రమ కేసులు పెట్టి కాళ్లు, చేతులు కట్టిపడేశారంటూ రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
రేపు కోర్టులో...
రేపు బెయిల్ పిటీషన్తో పాటు కస్టడీ పిటీషన్ కూడా విచారణకు రానుండటంతో కొంత టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకే నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారంటున్నారు. హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా పార్టీ నేతలతో పాటు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును వీలయినంత త్వరగా బెయిల్ పై బయటకు తీసుకురావాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రేపటి వారి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయన్నది చూడాల్సి ఉంది. చంద్రబాబు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చేంత వరకూ రాజమండ్రిలోనే ఉండాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు బాలకృష్ణ, దేవాన్ష్ లు సయితం రాజమంద్రిలోనే ఉన్నారు.
Next Story