Sun Mar 15 2026 08:58:05 GMT+0530 (India Standard Time)
Chandrababu : జనంలోకి టీడీపీ చీఫ్.. అదేపేరుతో వెళ్లాలని నిర్ణయం
వచ్చే వారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు.

ప్రజాగళం పేరుతో ఎన్టీఏ కూటమిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. నిన్న చిలకలూరి పేట వద్ద నిర్వహించిన సక్సెస్ కావడంతో అదే పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈరోజు సీనియర్ నేతలతో భేటీ అయిన చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. పోలింగ్ కు ఎక్కువ సమయం ఉండటంతో ప్రతి నియోజకవర్గంలో పర్యటించాలని నిశ్చయించారు.
వచ్చే వారం నుంచి...
వచ్చే వారం నుంచి ప్రజల్లోకి ప్రజాగళం పేరుతో చంద్రబాబు వెళ్లనున్నారని తెలిసింది. ఇంకా 16 చోట్ల శాసనసభ నియోజకవర్గాలకు, 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఆయన జనంలోకి వెళ్లాలన్న అభిప్రాయంలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు పోలింగ్ సమయానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు పార్టీని ిసిద్ధం చేస్తున్నారు.
Next Story

